HyderabadTelangana

కోటలో రాజు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి వెళ్ళాలి : విజయసాయి ట్వీట్

సాయి సయంతిక టీవీ, హైదరాబాద్ :- వైకాపా మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు ఆసక్తికర ట్వీట్ చేశారు. కోటరీ అనే అంశంపై ఆయన తన ఎక్స్ వేదికలో చేసిన ట్వీట్‌పై ఇపుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటూ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. విజయసాయి చేసిన ట్వీట్‌‍లో…

“పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేందంటే… ఆహా రాజా.. ఓహో రాజా అంటూ ప్రశంసలతో రాజు కళ్లకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దానివల్ల రాజు పోయేవాడు. రాజ్యం కూడా పోయింది.

మహారాజు తెలివైనవాడైతే కోటరీ కుట్రల్ని గమనించి, మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు. తర్వాత వారిమీద (కోటరీ) వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు. కోటా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే” అంటూ పేర్కొన్నారు.

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us.
Start Chat with:
chat Need Help?
×
Send this to a friend